Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 1:43 pm Posted by : ramakrishna

తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని ఆగ్రహం

డిల్లీ, బతుకమ్మ :  తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయని, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించడం లేదని ఎంపీలపై మండిపడినట్లు సమాచారం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు ప్రధాని మోదీ హితవుపలికారు. గురువారం ఉదయం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలకు ప్రధాని మోదీ అల్పాహార విందు ఇచ్చారు. ఎంపీలతో సుమారు అరగంట పాటు మోదీ మాట్లాడారు. తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ సోషల్ మీడియా చాలా తక్కువగా ఉందని, మంచి టీమ్‌ను పెట్టుకుని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉన్నా కూడా సమస్య ఏంటి అని ప్రశ్నించినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ పెరగడానికి మంచి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారని  ఎంపీలతో  ప్రధాని మోదీ పేర్కొన్నారు.