Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 8:28 pm Posted by : ramakrishna

ట్రాన్స్ఫార్మర్ల చోరి కేసు లలో ప్రధాన నిందితుడు

 

 . . . 54 ట్రాన్స్ పార్మర్స్ కాపర్ కాయిల్స్ చోరి కేసులో నిందితుడు

భిక్కనూరు, బతుకమ్మ:

కామారెడ్డి, మెదక్  జిల్లాలో 54 ట్రాన్స్ఫార్మర్ల ను ధ్వంసం చేసి కాఫర్ కాయిల్స్ చోరీ చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బిచ్కుంద చెందిన షంషేర్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ తెలిపారు. శనివారం భిక్కనూరు  పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ మధు సుధన్ కేసు వివరాలను వెల్లడించారు. భిక్కనూరు, మెదక్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్న ముఠాను ఇదివరకే పట్టుకోగా ప్రధాన నిందితుడిగా ఉన్న షంషేర్ సింగ్ తప్పించుకుని జరుగుతున్నట్లు తెలిపారు. అతడు  బిక్కనూర్ మండలం లో రామేశ్వర్ పల్లె గ్రామంలో ట్రాన్స్ఫార్మర్స్ ద్వసం చేసి రాగీ తీగలను చోరీ చేసిన నేపథ్యంలో రెక్కి నిర్వహిస్తుండగా భిక్కనూరు పోలీసులు చాకచక్యంగా  అతడిని పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షంషేర్ సింగ్ ను పట్టుకున్న భిక్కనూరు పోలీస్ లను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. సమావేశంలో భిక్కనూరు సీఐ నరేష్,ఎస్సై అనిల్, కానిస్టేబుల్ పాల్గొన్నారు.