భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలు
బతుకమ్మ, పిట్లం : మండల కేంద్రంలో శుక్రవారం సంత జరుగుతుంది. కూరగాయలు కొందామని వెళితే ధరలు భగ్గుమంటున్నాయి.నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరో భారం పడుతోంది. వర్షాలు, వరదలతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో టమాటా, ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. గతవారం ఉల్లి కిలో రూ.60 ఉండగా, ఇప్పుడు రూ.80కి చేరింది. టమాటా ధర గతవారం రూ.50-60 ఉండగా ఇప్పుడు రూ.80-90 దాటేసింది. దసరా నాటికి రేట్లు రూ.100 దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏమి కొనలేం ఏమి...