Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 3:42 pm Posted by : ramakrishna

తగిన సమయంలో నివారణ చర్యలు తీసుకోవాలి

మోర్తాడ్, బతుకమ్మ: వరి నాటి 30 రోజులు కావడంతో పొలాల్లో  కాండంతొలుచు పురుగు, తాటాకు తెగులు, వరి ఈగ ఉధృతి గమనించడం జరిగిందని మోర్తాడ్ మండలం వ్యవసాయ అధికారి కుమార్ అన్నారు. కావున రైతులు తగిన సమయంలో  నివారణ చర్యలు చేపట్టినట్లు అయితే నష్టం తీవ్రత తక్కువగా వుండి మంచి పంటని సాధించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కాబట్టి రైతులు కాండంతొలుచు పురుగు, గమనించినట్టు అయితే నివారణకు కార్బొఫురోన్ 3 జి 10 కిలోలు ఎకరాకు లేదా క్లోరాన్ట్రోనిలిప్రోల్ 0.4  జి 4 కిలోలు ఎకరాకు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి 8 కిలోలు ఎకరాకు అలాగే తాటాకు తెగులు గమనించినట్టు అయితే క్లోరైపీరిఫోస్ 320 మి. లి లేదా ప్రొఫెనపోస్ 400 ఎంఎల్ వాడుకోవాలని తెలియజేశారు. అలాగే వరి ఈగ గమనిస్తే క్లోరైపీరిఫోస్ 320 ఎంఎల్ ఎకరాకు వాడుకోవాలని రైతులకు అవగాహణ కల్పించారు. కార్యక్రమంలో రైతులు మహిపాల్, రాజ్ భరత్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.