Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 5:23 pm Posted by : ramakrishna

ఒలింపిక్ సంఘ బాధ్యులను సన్మానించిన ఒలింపిక్ జిల్లా అధ్యక్షులు

నిజామాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియం లోని ఒలింపిక్ భవనం లో నూతనంగా ఎంపికయినా రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, కోశాధికారి సతీష్ గౌడ్ లను బుధవారం  నిజామాబాదు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి పూల గుచ్చం ఇచ్చి శాలువా తో సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన ఒలింపిక్ సంఘ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ని సన్మానిచడం జరిగిందని తెలిపారు.  క్రీడాల అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. జిల్లా, నియోజక వర్గ పరిధిలో అన్ని సౌకర్యాలతో స్టేడియయాలు నిర్మించాలని కోరారు.  జిల్లా కేంద్రాలలో కోచ్ లను భర్తీ చేయాలని సూచించారు. జిల్లా కేంద్రం లోని కలెక్టర్ మైదానాన్ని తొందరగా నిర్మించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో క్రీడాలకు సరైన సౌకర్యాలు లెక్కున్నఅంతర్జాతీయ క్రీడాకారులు వున్నారని, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో రాణిస్తారని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమం లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్, తెలంగాణ అర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్, జిల్లా సెపక్ తక్రా కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాధరి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Presidents of the Olympic District honored the officials of the Olympic Association