Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 June 2025, 6:09 pm Posted by : ramakrishna

హిందూ ఆలయాల పరిరక్షణ మనందరి బాధ్యత

  • నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిందూ ఆలయాల పరిరక్షణ మనందరి బాధ్యత అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలో శుక్రవారం జరిగిన పలు దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “హిందూ ఆలయాలను సంరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఇలాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని,దేవాలయాల సందర్శన ద్వారా పిల్లలకు మన సాంస్కృతిక విలువలను తెలియజేయాలని సూచించారు. ఆలయాల అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు.

Preservation of Hindu temples is the responsibility of all of us.