. లక్ష్మీ కాలువ భూమిలో నుంచి కబ్జాలను తొలగించాలని డిమాండ్
ముప్కాల్, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీకాలువ భూమిని ఆక్రమించి నిర్మించిన షెడ్డును తొలగించాలని గ్రామ పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ముప్కాల్ గ్రామ పరిరక్షణ కమిటీ సభ్యులు బుధవారం విలేకరులతో మాట్లాడారు. షెడ్డు తొలగించే వరకు నిరాహార దీక్ష చేపడుతామని అన్నారు. కబ్జా చేసిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్న ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ భాను ప్రకాశ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో కబ్జాను తొలగించాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ప్రవీణ్ రెడ్డి గత నెల 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కానీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ భాను ప్రకాశ్ కబ్జాదారుకు వత్తాసు పలుకుతున్నారని, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలన్నారు. సమావేశంలో పరిరక్షణ కమిటీ సభ్యులు నాయకుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
