తాము చదువుకున్న స్కూల్ కు మహనీయుల చిత్రపటాల అందజేత

  ఏర్గట్ల, బతుకమ్మ :   గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులైన వడ్నాల జగదీష్, వారి భార్య వడ్నాల నవనీత తాము చదువుకున్న ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రూ.11 వేల విలువచేసే మహనీయులైన దేశభక్తుల ఫోటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదీష్ మాట్లాడుతూ, మేము చిన్ననాటి నుండి చదువుకున్న పాఠశాలకు మహనీయుల ఫోటోలను విరాళంగా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి, ఉపాధ్యాయులైన జగదీష్, నవనీత...