Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 6:13 pm Posted by : ramakrishna

తాము చదువుకున్న స్కూల్ కు మహనీయుల చిత్రపటాల అందజేత

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులైన వడ్నాల జగదీష్, వారి భార్య వడ్నాల నవనీత తాము చదువుకున్న ఏర్గట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సుమారు రూ.11 వేల విలువచేసే మహనీయులైన దేశభక్తుల ఫోటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు జగదీష్ మాట్లాడుతూ, మేము చిన్ననాటి నుండి చదువుకున్న పాఠశాలకు మహనీయుల ఫోటోలను విరాళంగా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి, ఉపాధ్యాయులైన జగదీష్, నవనీత ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగరాణి, పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, శ్రీనివాస్, విజయ్, రాజనర్సయ్య, రాజేందర్, ప్రవీణ్ శర్మ, గంగాధర్, శ్రీనివాస్, గంగా మోహన్, ట్వింకిల్, నరేష్, సమత, జ్యోతి, కోమలి, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.