Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2024, 4:20 pm Posted by : ramakrishna

శ్రీ రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదానం

బతుకమ్మ: బిచ్కుంద :  కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లో శ్రీ రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి తరపున 2024 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ గ్రేడులు సాధించిన విద్యార్థులకు రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు.  9.5 జిపిఏ సాధించిన పుల్కల్ పాఠశాల విద్యార్థిని, 9.3 గ్రేడు సాధించిన బాలికల ఉన్నత పాఠశాల బిచ్కుంద విద్యార్థిని, గుండె నేమ్లి విద్యార్థులు లకు మెడల్, మేమెంటో, ప్రశంసా పత్రాలతో పాటు వేయి రూపాయల నగదు ను పురస్కారం గా ప్రదానం చేశారు.

Presentation of Shree Rachcha Jagannath Memorial Talent Awards
ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్, శ్రీనివాస్ రెడ్డి, రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ప్రతినిధి రచ్చ శివకాంత్, ఉపాధ్యాయులు మారుతి రావు, సందీప్, మనోహర్, భూమన్న, మల్లికార్జున్, దేవ రావు, వైజయంతి, కవిత, శ్రీరామ్, సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Presentation of Shree Rachcha Jagannath Memorial Talent Awards