రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సీఎం కప్ టోర్నమెంట్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కబడ్డీ పోటీలలో విన్నర్, రన్నర్- రుద్రూర్, ఖోఖో పోటీలలో రన్నర్, విన్నర్ – రుద్రూర్, వాలిబాల్ విన్నర్ – సులేమాన్ నగర్, వాలిబాల్ రన్నర్ – రుద్రూర్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు గెలుపొందారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ చేతుల మీదుగా సీఎం కప్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలగంగాధర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.