Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:34 pm Posted by : ramakrishna

విజేతలకు బహుమతుల అందజేత

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని ఠాణంపల్లి గ్రామంలో మధు ప్రీమియర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో  విజేతలైన సులేమాన్ నగర్ టీంకు కొత్తపల్లి రవి కిరణ్ చేతుల మీదుగా పదివేల రూపాయల నగదు అందజేశారు. ద్వితీయ బహుమతి ఠాణంపల్లి టీంకు బిఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ సహకారంతో 5 వేల రూపాయలు నగదు బహుమతిని ఎస్సై సాయన్న అందజేశారు. అదేవిధంగా రుద్రూర్ గ్రామానికి చెందిన శేర్యాల శ్రీనివాస్ గౌడ్ తండ్రి శేర్యాల మారుతి గౌడ్ జ్ఞాపకార్ధకంగా రూ. 1,111 నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండలవాడి శంకర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ బీఆర్ ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, దౌర్ సాయిలు, వార్డు మెంబర్లు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.