సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు ప్రశంసా పత్రాల బహూకరణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు బహూకరించి సత్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు...