Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 6:15 pm Posted by : ramakrishna

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు ప్రశంసా పత్రాల బహూకరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు బహూకరించి సత్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరుల చేతుల మీదుగా సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

 

Presentation of certificates of appreciation to social media influencers

 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యల గురించి విశేషంగా కృషి చేసిన దృష్ట్యా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను సత్కరించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

Presentation of certificates of appreciation to social media influencers