Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 9:02 pm Posted by : ramakrishna

పిల్లలకు ఆటస్థలం సిద్ధం

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్లో క్రీడా ప్రాంగణంలో వర్షపు నీళ్లతో బురదగా ఉందని ఆటలకు ఇబ్బంది కలుగుతుందని పాఠశాల సిబ్బంది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కి విన్నవించడం జరిగింది.  వెంటనే స్పందించి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గిర్మాజీ గోపికి  ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో గిర్మాజీగోపి  పాఠశాల దగ్గరికి వెళ్లి చూసి తక్షణమే తగిన మొరంను ఉచితంగా పోయించి పిల్లలు ఆడుకోవడానికి అణువుగా ఆట స్థలాన్ని సిద్ధం చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలలో పట్టణ అధ్యక్షుడు పుప్పాల  అశోక్ మోర్తాడు వీడిసి అధ్యక్షులు మోతే సుభాష్, కురుమ నరేష్, గుర్రంఅశోక్,  నజీర్. పెద్ది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.