Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 5:24 pm Posted by : ramakrishna

స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి

  • మండల రూరల్ ఇంచార్జ్ యోగేశ్వర నర్సయ్య

 

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, భీమ్ గల్ మండల రూరల్ ఇంచార్జ్ యోగేశ్వర నర్సయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ రూరల్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో ఎలక్షన్ మీటింగ్ అండ్ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకు వెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీయే విజయ డంకా మారు మరోగిస్తుందన్నారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు ఆరె రవీందర్,కిషన్ మోర్చా అధ్యక్షుడు తోట గంగాధర్,  ప్రధాన కార్యదర్శి రామకృష్ణ,  యువ మోర్చా అధ్యక్షుడు సీనియర్ నాయకులు సంధ్యారాజు,  అకిం భాయ్, కొట్టాల అశోక్ కిషోర్, అంజయ్య,వెంకటేష్, వివిధ గ్రామాల నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.