Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 February 2025, 7:05 pm Posted by : ramakrishna

అంబులెన్స్ లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

కామారెడ్డి, బతుకమ్మ : ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ గర్భిణీ 108 అంబులెన్స్ లోనే ప్రసవించిన ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తండాకు చెందిన లలిత అనే నిండు గర్భిణీ కి పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో 108 కు కుటుంబ సభ్యులు ఫోన్ లో సమాచారం అందిచారు.  దీంతో 108 అంబులెన్స్ అక్కడికి చేరకుంది. కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలో 108 అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అంబెలెన్స్ సిబ్బంది తెలిపారు.