మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణులకు ఎంతకష్టం..

గంటల తరబడి తప్పని నిరీక్షణ..   బాన్సువాడ బతుకమ్మ :  బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో  గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. వైద్యం కోసం తెల్లవారుజామునే ఆస్పత్రికి చేరుకునే గర్భిణులు గంటల తరబడి ఆస్పత్రిలో నిరీక్షణలో ఉన్నారు. కానీ వారికి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండట్లేవు.  కూర్చునేందుకు కనీసం కుర్చీలు కరువు.. కూర్చోవడానికి కుర్చీలు లేక చాలామంది నేలపైనే కూర్చుని వైద్యం కోసం వేచిచూస్తున్నారు. ప్రతిరోజు దాదాపు వందల సంఖ్యలో గర్భిణులు ఆస్పత్రికి వస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని సదుపాయాలు కల్పించడంలో...