సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి
. . . డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి, వ్యాధి నిరోధక టీకాలపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి ట్యాంకులను...