Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 6:51 pm Posted by : ramakrishna

విలువైన జీవితాలు చీకటిమయం కాకూడదు

మోర్తాడ్, బతుకమ్మ: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నేడు యువత సరదాగా చాక్లెట్లు, సిగరెట్లు వంటి వాటి ద్వారా అలవాటై క్రమేనా మత్తుకు బానిసై విలువైన జీవితాలను వారిపై ఆధారపడిన కుటుంబాలను చీకటిమైనా చేసుకుంటున్నారని మోర్తాడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెద్దన్న అన్నారు. విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని సామాజిక సంబంధాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  మోర్తాడ్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు 1908 కి కాల్ చేసి డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మర్రిపల్లి భూపతి, ఆంటీ డ్రగ్స్ కమిటీ కోఆర్డినేటర్ రాజయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ దశరథ్, ఆంటీ డ్రెస్ కమిటీ సభ్యులు అర్చన, బ్యూలా, అధ్యాపక అధ్యాపకేతర బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Precious lives should not be darkened.