Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 6:44 pm Posted by : ramakrishna

ప్రమాదాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నగరంలోని శ్రీ రామ గార్డెన్స్ లో నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్, గ్రామ సర్పంచులు లతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

Precautions should be taken to avoid accidents.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.  ప్రపంచంలో ఒక్క యాక్సిడెంట్ జరుగకుండా ఉన్న దేశం ప్రస్తుతం ఫిన్లాండ్ దేశం అని అన్నారు.

 

Precautions should be taken to avoid accidents.

 

వ్యవసాయదారులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు. అధిక వేగం,  క్రమశిక్షణ లోపం, అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తాయని వివరించారు. ఆరోగ్యంపై శ్రద్ధ, ట్రాఫిక్ నియమాల కట్టుదిట్టమైన పద్ధతుల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా లోని ప్రజలందరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు అందరూ హెల్మెట్ ధరిస్తే జిల్లా వ్యాప్తంగా అందరిని ఐపిఎల్ మ్యాచ్ ఉచితంగా చూపిస్తామని అన్నారు.

 

Precautions should be taken to avoid accidents.

 

అనంతరం అరైవ్  అలైవ్ కి సంబందించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి, నగర మేయర్ కూరగాయల ఉమారాణి, నిజామాబాద్ ఇన్ చార్జి ఎసిపి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు చిన్న సాయిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, సిఐలు, ఎస్సైలు, యాంటీ నార్కోటిక్ ఇన్స్ పెక్టర్ పూర్ణేశ్వర్, సైబర్ క్రైమ్ ఆర్. ఎస్. ఐ రవి, గ్రామ సర్పంచ్ లు, కార్పొరేటర్స్, ప్రజలు, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.

 

Precautions should be taken to avoid accidents.