ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రదేశంలో చెరువు వద్ద వినాయక ప్రతిమల నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. ప్రధాన రహదారి నుండి చెరువు వరకు గల రోడ్డును, విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశంలోని వసతులను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన...