పూర్వ ట్రెసానే నయం
మననం చేసుకుంటున్న రెవెన్యూ ఉద్యోగులు అప్పట్లో విధులు, యూనియన్ బాధ్యతలు ప్రస్తుతం 'ముదిమి'లో నాయకత్వం నిజామాబాద్ బతుకమ్మ : అప్పట్లో రెవిన్యూ విభాగంలో నిస్పక్షపాతంగా విధులు నిర్వహించిన నాయకులే నయం. తమకు కేటాయించిన వృత్తి ధర్మాలను సక్రమంగా నిర్వహిస్తూనే, నాయకత్వాన్ని నడిపించారని జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు (ట్రెస్మా సంఘం బాధ్యులు) మననం చేసుకుంటున్నారు. శాఖలో ఏ ఉద్యోగికైనా ఇబ్బందులు ఎదురైతే వెన్నంటే ఉండి నెరవేర్చేవారని మాట్లాడుకుంటున్నారు. గత ఏడేళ్లుగా నాయకత్వం నుంచి సమస్యలు వస్తే తాము ఉన్నామనే భరోసా మాటలు చెవులకు వినిపించిన దాఖలాలు లేవని...