నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయలో ప్రీ- పిహెచ్. డి 2023-24( రెగ్యులర్ )2022-23 బ్యాక్ లాక్ పరిశోధక విద్యార్థులకు ఫీ నోటిఫికేషన్ కంట్రోలర్ ఆచార్య కే. సంపత్ కుమార్ విడుదల చేశారు. తెలంగాణ వర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ( ఇంగ్లీష్, హిందీ,తెలుగు స్టడీస్, ఉర్దూ ) సోషల్ సైన్స్ ( అప్లైడ్ ఎకనామిక్స్,మాస్ కమ్యూనికేషన్, సోషల్ వర్క్, లా / కామర్స్ / బిజినెస్ మేనేజ్మెంట్. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సస్ ( బాటని/ బయోటెక్నాలజీ / జియో ఇన్ఫర్మేషక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అప్లైడ్ స్టాటిష్టిక్స్, మరియు కంప్యూటర్ సైన్స్ ) పీహెచ్డీ లో అడ్మిషన్ పొందిన పరిశోధక విద్యార్థులకు ఏప్రిల్ -2025 లో నిర్వహించే పరీక్షల కు హాజరయ్యే పరిశోధకులు ఫీ రూ. 1000 అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 8 వరకు 500 రూపాయల అపరాధ రుసుముతో ఏప్రిల్ 10 వరకు చెల్లించాలని కంట్రోలర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచామని తెలిపారు.