. . . ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముట్టడికి ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ పిలుపు
కామారెడ్డి, బతుకమ్మ:
న్యాయమైన డిమాండ్ల కోసం ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న జర్నలిస్టులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సోమవారం తెల్లవారు జాము నుంచి జిల్లా వ్యాప్తంగా దళిత గిరిజన జర్నలిస్టులను సుమారు 26 మందిని అరెస్టు చేశారు. ఐ ఆండ్ పీఆర్ కమిషనర్ ముట్టడికి వెలుతున్న జర్నలిస్టుల అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యాదయ్య అన్నారు.న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా వెళ్తున్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ కు తరలించడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.దళిత, గిరిజన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, గృహ సౌకర్యం వంటి న్యాయమైన సంక్షేమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న శాంతియుత నిరసన అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా హౌస్ అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ అందరినీ వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేయకుండా, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు