Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 4:39 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు

 

. . . రైతు ధర్నాకు వెళ్లకుండా చర్యలు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

యూరియా పంపిణీలో యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టనున్న రైతు ధర్నా నేపథ్యంలో బాన్సువాడ పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ముందు పలువురు బీఆర్ఎస్ నేతలును మంగళవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, ఒకటో వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, నాయకులు మోచి గణేష్ తదితరులు ఉన్నారు.