బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
మోర్తాడ్, బతుకమ్మ : భీంగల్ పట్టణంలో అభివృద్ధి పనుల పూర్తిపై డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేపట్టనున్న ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు మోర్తాడ్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకుల వివరాల ప్రకారం, భీంగల్‌లో గత ప్రభుత్వ హయాంలో ప్రశాంత్ రెడ్డి మంజూరు చేసిన అభివృద్ధి పనుల్లో సుమారు 70 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి...