పీడీఎస్ యూ నాయకుల ముందస్తు అరెస్ట్

తెయూలో  గవర్నర్ పర్యటన సందర్భంగా.. తెలంగాణ యూనివర్సిటీని గవర్నర్ ప్రక్షాళన చేయాలి.. డిచ్ పల్లి, బతుకమ్మ :  తెలంగాణ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా నగరంలో పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,జిల్లా నాయకులు నిఖిల్ లను బుధవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చాన్సలర్ హోదాలో గవర్నర్ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.  ఇంజినీరింగ్ కోర్సులను తీసుకురావాలని,...