తెయూలో గవర్నర్ పర్యటన సందర్భంగా..
తెలంగాణ యూనివర్సిటీని గవర్నర్ ప్రక్షాళన చేయాలి..
డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా నగరంలో పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్,జిల్లా నాయకులు నిఖిల్ లను బుధవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చాన్సలర్ హోదాలో గవర్నర్ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇంజినీరింగ్ కోర్సులను తీసుకురావాలని, బాలికల హాస్టల్ నిర్మాణం మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని, నూతన యూజీసీ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్సిటీ స్నాతకోత్సవానికియూనివర్సిటీ విద్యార్థులను పిలువకపోవడం సరైంది కాదని, అవినీతికి ఆస్కారం లేకుండా తెలంగాణ యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.