Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 3:36 pm Posted by : ramakrishna

బిఆర్ఎస్ ముఖ్యనేతల ముందస్తు అరెస్ట్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సందర్భంగా బిఆర్ఎస్ ముఖ్యనేతలను ముందస్తుగా అరెస్టు చేసి నగరంలోని 2వ టౌన్, 3వ టౌన్, 4వ టౌన్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. బిఆర్ఎస్ నేతలు సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి సుజిత్ సింగ్ ఠాగూర్ సత్య ప్రకాష్ చింతకాయల రాజు, అగ్గు సంతోష్ సదానంద్ లను పోలీస్ స్టేషన్కు వెళ్లి బిఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ మధుసుదన్ రావు, కో-కన్వీనర్ డాక్టర్ పులి జైపాల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను పూర్తి చేయకుండా, ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ మరి అదే ప్రజలు ప్రశ్నిస్తే వారిని అక్రమంగా అరెస్టు చేస్తూ, పోలీస్ పాలన నిర్వహిస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని వారు అన్నారు. వెంటనే వీరిని భేషరతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.

Pre-arrest of BRS key leaders