Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 2:44 pm Posted by : ramakrishna

ఆశా కార్యకర్తల ముందస్తు అరెస్ట్

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.సోమవారం హైదరాబాద్ లోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి బయలుదేరిన ఆశ కార్యకర్తలను పిట్లం లో అరెస్టు చేసిన  పోలీసులు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుత నిరసన కు బయలుదేరిన తమను అరెస్ట్ చేయడం ఎంత వరకు శోచనీయం  అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టు లకు పాల్పడకుండా న్యాయమైన ఆశ కార్యకర్తల డిమాండ్ లను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధ్యక్షురాలు కామేశ్వరి పుష్ప సునీత శశికళ ఆశ వర్కర్లు ఉన్నారు.