Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 November 2024, 6:32 pm Posted by : ramakrishna

పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి

స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మెందర్ 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మెందర్ డిమాండ్ చేశారు.  ఎస్ టి యు భవన్లో బుధవారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అద్యక్షులు ధర్మెందర్  మాట్లాడుతూ పి ఆర్ సి రిపోర్టుని వెంటనే తెప్పించుకొని 65% ఫిట్మెంట్ తో పిఆర్సి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరికీ మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, ప్రభుత్వం ఇవ్వవలసిన పెండింగ్ డి. ఏ లను ఆలస్యం లేకుండా ప్రకటించాలని అన్నారు.  సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలనిఅన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్తింప చేస్తున్న మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని  డిమాండ్ చేశారు. అదేవిధంగా  మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.  సమగ్ర కుల గణన సర్వే చేస్తున్న  ఎన్యుమరేటర్స్ కు  పారితోషకం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా కూడా తన  ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి న్యాయం చేయాలనిఅన్నారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు బెళ్ళల్ శ్రీనివాస్ మాట్లాడుతూ317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయ బాధితులను వెంటనే స్వంత జిల్లాలకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.డైట్, జూనియర్ కాలేజీ లో ఖాళీ గా ఉన్న పోస్టులను అర్హత గల ఉపాధ్యాయులకు ప్రమోషన్ ద్వారా నింపాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో  రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ (వాసు)  జిల్లా ఆర్థిక కార్యదర్శి అఫ్జల్ బేగ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మహేశ్వర్, మల్లయ్య కాంతారావు యాదగిరి రవీందర్ గౌడ్ చంద్ర శేఖర్ సురేందర్, గంగా కిషన్, టి. శ్రీనివాస్ రత్నాకర్, రమేష్ సనావుద్దీన్, సలీం, వేణు హరికృష్ణ   వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.