పీఆర్సీ, డీఏలు వెంటనే ప్రకటించాలి

  . . . టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల లింగం   కామారెడ్డి, బతుకమ్మ :   పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయాలని టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల లింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యలపై ఆయన మాట్లాడారు. యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాలుగు దశల ఉద్యమ కార్యక్రమాల్లో...