బాల సాహితీ మిత్ర పురస్కారం అందుకున్న ప్రవీణ్ శర్మ
ఏర్గట్ల, బతుకమ్మ : తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారు 2025-2026 సంవత్సరానికి గాను జాతీయస్థాయిలో బాలసాహితీ మిత్ర పురస్కారాలను ప్రకటించారు. దీనిలో భాగంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రవీణ్ శర్మకు ఈ పురస్కారాన్ని అందించారు. విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని పెంచుతూ వారిచేత అనేక ప్రక్రియలలో రచనలు చేయిస్తూ విద్యార్థులకు సాహిత్య అభిలాషను కల్పించడమే కాకుండా జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో విద్యార్థులు అనేక బహుమతులు పొందినందుకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం జిల్లా...