Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 5:09 pm Posted by : ramakrishna

బాల సాహితీ మిత్ర పురస్కారం అందుకున్న ప్రవీణ్ శర్మ

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారు 2025-2026 సంవత్సరానికి గాను జాతీయస్థాయిలో బాలసాహితీ మిత్ర పురస్కారాలను ప్రకటించారు. దీనిలో భాగంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రవీణ్ శర్మకు ఈ పురస్కారాన్ని అందించారు. విద్యార్థులలో సృజనాత్మకత శక్తిని పెంచుతూ వారిచేత అనేక ప్రక్రియలలో రచనలు చేయిస్తూ విద్యార్థులకు సాహిత్య అభిలాషను కల్పించడమే కాకుండా జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో విద్యార్థులు అనేక బహుమతులు పొందినందుకు గాను ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ప్రవీణ్ శర్మ అందుకున్నారు. బాల సాహితీ మిత్ర పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉందని రాబోయే రోజులలో విద్యార్థుల చేత అనేక సాహిత్య కార్యక్రమాలకు ఈ పురస్కారం నాంది భూతం కాబోతుందని ప్రవీణ్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఈ బి అధికారి సీతయ్య, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక అధ్యక్షులు కాసర్ల నరేష్, కోకిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.