ఉత్తమ విధ్యార్థినిగా ప్రవస్థి ఎంపిక

బతుకమ్మ,మెండోరా: విశ్వం ఎడ్యుటెక్ హైదరాబాద్ వారు నిర్వహించిన నేషనల్ లెవెల్ స్పెల్ బి కార్నివల్ నందు మెండోరా మండలం  వెల్గటూర్ శ్రీ వివేకానంద హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మండాజీ  ప్రవస్థి తన ప్రతిభను కనబరిచి  ఉత్తమ విద్యార్థిగా ఎంపికైనట్టు పాఠశాల కరస్పాండెంట్  మండాజి రాజ్ కుమార్  తెలియజేశారు. ఈ సందర్బంగా పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేశారు. విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు.