Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 8:33 pm Posted by : ramakrishna

రెండోసారి రాజంపేట మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడేంట్ గా ప్రణిత్ రెడ్డి

 

రాజంపేట్, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎర్రప్రణిత్ రెడ్డి రెండోసారి నియమితులు అయ్యారు. ఈ నెల 5న ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రకటించిన మండల కాంగ్రెస్ కార్యవర్గంలో ఎర్రప్రణిత్ కు రెండోసారి అవకాశం కల్పించారు. తనపై నమ్మకంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజంపేట మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. బుదవారం ఎమ్మెల్యే నివాసంలో నూతనంగా ఎంపిక చేసిన మండల కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం చేయడం గ్రామాల అభివృద్ధి అంశాలపై చర్చించి, పార్టీ కోసం కష్టపడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

 

Pranith Reddy elected as Rajampet Mandal Congress Working President for the second time