నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండడంతో ఈ నెల 21న జరగాల్సిన ప్రజావాణిని వాయిదా వేశామని అన్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి తిరిగి యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.