ప్రజావాణి పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు శాఖల్లో పెండింగులో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇప్పటి వరకు 19501 అర్జీలు రాగా, 18838 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, ఇంకనూ 663 అర్జీలు పెండింగులో ఉన్నాయని తెలిపారు. సోమవారం 71 అర్జీలు వచ్చాయని తెలిపారు....