Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 3:25 pm Posted by : ramakrishna

యథావిధిగా ప్రజావాణి

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని సమావేశ మందిరంలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని  వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.