భీమ్ గల్, బతుకమ్మ : మున్సిపల్ ఎంప్లాయిస్ సెంట్రల్ పోరం వ్యవస్థాపక అధ్యక్షులు బి. ప్రహల్లాద్ సేవలు చిరస్మరణీయం మనీ మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్ గారు అన్నారు. బి. ప్రహల్లాద్ గురువారం ఆయన స్వగృహంలో హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్నుముయగా, భీమ్ గల్ పురపాలక సంఘం కార్యాలయంలో ఆయన సంతాప సభను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ప్రహల్లాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులను అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రహల్లాద్ మున్సిపల్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారని, ఈ క్రమంలో మున్సిపల్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక పోరాటం నిర్వహించారన్నారు. ముఖ్యంగా 010 ద్వారా ప్రభుత్వ గ్రాంటు నుండి మున్సిపల్ ఉద్యోగులకు వేతనాల మంజూరులో ఆయన పాత్ర వెలకట్టలేనిది అన్నారు. ప్రహ్లాద్ ఎంతో నిబంధనతో తనదైన శైలి ద్వారా ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక పోరాటాల నిర్వహించినారని, అలాంటి వ్యక్తి మన నుండి దూరం అవటం నిజంగా విచారించవలసిన విషయం అన్నారు. ఏదైతే ఆశయం కోసం ఉద్యోగుల ప్రయోజనాల కోసం, తను రిటైర్మెంట్ అయినప్పటికీ, సలహాలు సూచనలు చేస్తూ, ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉండేవారని, ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొని, ప్రహ్లాద్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.