Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:40 pm Posted by : ramakrishna

ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు అందజేత

 

రుద్రూర్ బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ లో గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పోశెట్టి అనే వ్యక్తి ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా పథకం తీసుకొని ఉన్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మరణించినందున వారి నామిని అయినా ఎర్రోళ్ల లక్ష్మి కి క్లెయిమ్ రూపాయలు 2,00,000/- రెండు లక్షల చెక్కును లబ్దిదారురాలికి అందించారు. బ్యాంకు ఖాతాదారులు ఈ భీమా సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కెనరా బ్యాంక్ మేనేజర్ డి.ఈరు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లఖన్, జ్ఞానేశ్వర్, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.