Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2025, 11:44 am Posted by : ramakrishna

మరో వారం రోజుల పాటు ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు

 హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్ రావు డిసెంబర్ 12న లొంగిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈకేసుపై విచారణ సుప్రీం కోర్టులో జరిగింది. రిమాండ్ రిపోర్టును కోర్టుకు సిట్ తరపు న్యాయవాది సమర్పించారు. నిందితుడు విచారణకు సహకరించడం లేదని మరోసారి కస్టోడియల్ విచారణ అవసరముందని కోర్టుకు తెలిపారు.దీంతో   డిసెంబర్ 25 వరకు  ప్రభాకర్ రావు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి  చర్యలు తీసుకోవద్దని  కోర్టు సూచించింది.