Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 7:16 pm Posted by : ramakrishna

రేపు విద్యుత్ సరపరాలో అంతరాయం

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

జిల్లా కేంద్రంలోని బోర్గాం 132/33 కెవి విద్యుత్ ఉపకేంద్రం నుండి వెళ్తున్న 33 కెవి లైన్లు కింద 1.2 మెగావాట్ సోలార్ ఆర్య నగర్ పనులు చేపడుతున్నందువలన గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విధ్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నిజామాబాద్ సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ ఈ పివి రాజేశ్వరరావు తెలిపారు. 33కేవి లైన్లు షిఫ్టింగ్ పనుల , అత్యవసర మెయింటెనెన్స్ కారణంగా నిజామాబాద్ నగరంలోని ఆర్య నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని తిలక్ గార్డెన్, దుబ్బ, వినాయక నగర్, మిర్చి కాంపౌండ్ ఎరియాలలో కరేంట్ సరఫరా ఉండదన్నారు. మోపాల్ మండల పరిధిలో ఠాణా కుర్దు, ముదక్ పల్లి, మంచిప్ప, సిర్పూర్ ,బాడ్సి గ్రామాలలో, నిజామాబాద్ రూరల్ మండలంలోని కొత్తపేట్, మల్లారం లో విధ్యుత్ సరఫరా లో ఆంతరాయం కలుగుతుందని విధ్యుత్ వినియోగదారులు గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ ఎస్ఇ తెలిపారు.