Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 4:52 pm Posted by : ramakrishna

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నగరంలోని వినాయక్ నగర్ 33/11కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం 9 నుంచి 11గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని టౌన్-1 ఏడీఈ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. వినాయక్ నగర్, 100 ఫీట్ల రోడ్డు, ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ, కోటగల్లీ, గాయత్రినగర్, చంద్రానగర్, న్యాల్కల్ రోడ్డు, శ్రీనగర్, ఫూలాంగ్, గోల్ హనుమాన్, ఆకుల పాపయ్య రోడ్, గూడెం తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.