Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 August 2025, 8:17 pm Posted by : ramakrishna

జెన్ కో లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

మెండోరా, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువైన కాకతీయ కాలువ ద్వారా 5000 క్యూసెక్కుల నీటి విడుదల చేయడంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న  విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని జెన్ కో డీ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్లు ఉండగా యూనిట్-1 ద్వారా 6 మెగా వాట్స్, యూనిట్-3 ద్వారా 6 మెగా వాట్స్  మొత్తం 12.00 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.