పవర్ డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ పవర్ డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ నిజామాబాద్ సర్కిల్ ఎన్నిక ఆదివారం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. నరేందర్ ఎన్నికల అధికారిగా, కరీంనగర్ సర్కిల్ సెక్రెటరీ సంపత్ సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నిజామాబాద్ సర్కిల్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అనంతరం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనరల్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యేశ్వర రావు మాట్లాడుతూ... విద్యుత్ సంస్థలో పవర్ డిప్లమా ఇంజినీర్స్ కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. విద్యుత్ సంస్థ కోసం సభ్యులు పాటుపడుతున్నా...