Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 August 2025, 1:38 pm Posted by : ramakrishna

పవర్ డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ నిజామాబాద్ సర్కిల్ కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ పవర్ డిప్లమా ఇంజినీర్స్ అసోసియేషన్ నిజామాబాద్ సర్కిల్ ఎన్నిక ఆదివారం జరిగింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. నరేందర్ ఎన్నికల అధికారిగా, కరీంనగర్ సర్కిల్ సెక్రెటరీ సంపత్  సహాయ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నిజామాబాద్ సర్కిల్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అనంతరం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  హాజరైన జనరల్ సెక్రెటరీ సుబ్రహ్మణ్యేశ్వర రావు  మాట్లాడుతూ…  విద్యుత్ సంస్థలో పవర్ డిప్లమా ఇంజినీర్స్ కీలకపాత్ర వహిస్తున్నారన్నారు.  విద్యుత్ సంస్థ కోసం సభ్యులు పాటుపడుతున్నా రన్నారు.  సర్వ సభ్య సమావేశానికి జిల్లా అధ్యక్షులు పి. రాజేందర్ రెడ్డి  అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తోట రాజశేఖర్, సర్కిల్ కార్యదర్శి ఏ కాశీనాథ్, సర్కిల్ కోశాధికారి పి శ్రీనివాస్, మహిళా ప్రతినిధి ఆర్ సుమిత, డివిజన్ సెక్రెటరీలు జి శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్, నాయిని కృష్ణ, శంకర్ గౌడ్, గంగాధర్, కోశాధికారులు భరత్, గిరిధర్, భరత్ కుమార్, కాంతారావు, జుబేర్, ఏడీఈ లు, ఏఈలు సబ్ ఇంజినీర్స్ 110 మంది సభ్యులు పాల్గొన్నారు

నిజామాబాద్ సర్కిల్ అధ్యక్షుడిగా రాజేందర్ రెడ్డి

తెలంగాణ పవర్ డిప్లమా ఇంజినీర్ అసోసియేషన్ నిజామాబాద్ సర్కిల్ అధ్యక్షుడిగా పి.రాజేందర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా ఏ కాశీనాథ్, కోశాధికారిగా పి.శ్రీనివాసులను, మహిళా ప్రతినిధిగా ఆర్ సుమతీ, కార్యాలయ కార్యదర్శిగా కె ఎస్ ఆర్ మూర్తి లను ఎన్నుకున్నారు. నిజామాబాద్ డివిజన్ కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారి భరత్, బోధన్ సెక్రెటరీగా నాయిని కృష్ణ, కోశాధికారిగా గిరిధర్ లను ఎన్నుకున్నారు. ఆర్మూర్ కార్యదర్శిగా గంగాధర్, కోశాధికారిగా కాంతారావు, ఎం ఆర్ టీ డివిజన్ కార్యదర్శిగా  శ్రీనివాస్, కోశాధికారిగా జూబేర్లను ఎన్నుకున్నారు.

Power Diploma Engineers Association Nizamabad Circle Executive Committee Election