కరెంటు కోతలు.. కాళరాత్రులు..
అల్లాడుతున్న జనం.. రుద్రూర్, బతుకమ్మ: ఓ వైపు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరోవైపు కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క రోజులోనే దాదాపు 05 నుంచి 10 సార్లు విద్యుత్ ట్రిప్.. ఇక గాలి దుమారం వచ్చిందంటే ఎక్కడో ఒక చోట అంతరాయం.. గంటల తరబడి వేచి చూస్తే కానీ పునరుద్ధరణ కానీ పరిస్థితులు.. పలుచోట్ల తరచుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు. అప్రకటిత విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్నారు....