Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 8:52 pm Posted by : ramakrishna

డోన్ పాల్ లో ఘనంగా పోషన్ పక్వాడ

మోర్తాడ్, బతుకమ్మ :

 

మోర్తాడ్ మండల్ డోన్ పాల్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రంలో శుక్రవారం పోశం పక్వాడలో భాగంగా ప్రోగ్రాం నిర్వహించారు. అలాగే అంగన్ వాడీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే కూడా నిర్వహించారు. గర్భిణీ, బాలింతలు పౌష్టికాహారం గురించి వాళ్లకు తెలిపారు. అంగన్ వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలని తెలియజేశారు. ప్రీస్కూల్ విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. పిల్లల్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు అంగన్ వాడీ కేంద్రానికి పంపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సూపర్వైజర్ బి.మంజుల, ధోన్ పాల్ గ్రామ సెక్రటరీ లక్ష్మీ దుర్గ, గ్రామ సర్పంచ్ బాజమ్మ, అంగన్ వాడీ టీచర్ కె.సుజాత, ఆయా లత, గర్భిణీ బాలింతలు పిల్లలు, గ్రామ పెద్దలు ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.